Image Source: pexels

ఆరోగ్యకరమైన చర్మం కోసం అవసరమైన విటమిన్లు ఇవే

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అవసరం. ఈ పోషకాలను పొందినప్పుడు చర్మం యవ్వనంగా ఉంటుంది.

విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

విటమిన్-సి వేడి, కాలుష్యం కారణంగా చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

విటమిన్-సి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. అంతేకాదు టోన్ ను ప్రకాశవంతం చేస్తుంది.

విటమిన్ ఇ మీ చర్మానికి కావాల్సిన ప్రకాశాన్ని అందిస్తుంది. తేమగా ఉంచుతుంది.

విటమిన్ ఎ చర్మాన్ని యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మకణాలను రిపేర్ చేస్తుంది.

విటమిన్ ఎ.. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ముఖంపై గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

విటమిన్ డి చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇన్ఫెక్షన్, వాపు నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

విటమిన్ కె రక్తనాళాల గోడలను బలపరుస్తుంది. నల్లటి వలయాలను, గాయాలని నివారిస్తుంది.

Image Source: pexels

విటమిన్ కె యాంటీ ఏజింగ్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.