Image Source: pexels

ఏపీలో బెస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే

తూర్పుకనుమల మధ్య ఉన్న అరకులోయ అద్భుతంగా ఉంటుంది. కాఫీ తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ఫేమస్.

విశాఖ తీరంలోని రుషికొండ బీచ్, యారాడబీచ్, రామకృష్ణ బీచ్ వంటి అందమైన బీచ్ లుఉన్నాయి.

తిరుపతి పవిత్ర ప్రదేశం. ఆధ్యాత్మిక భావన కోసం సందర్శించవచ్చు. చంద్రగిరికోట, సిలాతోరణం కూడా చూడవచ్చు.

కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడలో ఉండవల్లి గుహలు, భవానీ ద్వీపం,కనకదుర్గ ఆలయం చూడవచ్చు.

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న పులికాట్ సరస్సు ఇండియాలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.

ఏపీ కశ్మీర్ గా పిలిచే లంబసింగి..చల్లని వాతావారణానికి ఫేమస్. కపుల్స్ కు రొమాంటిక్ డెస్టినేషన్

హార్సిలీహిల్స్ స్టేషన్ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది. ట్రెక్కింగ్ కోసం వెళ్లవచ్చు.

Image Source: pexels

కొల్లేరు సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. పక్షుల వీక్షకులు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.