చాలామందికి తెలియని ఆరోగ్యకరమైన కూరగాయలు ఇవే మనలో చాలా మందికి కొన్ని రకాల కూరగాయలు, వాటి ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటో చూద్దం. తెల్లముల్లంగిని జపాన్, ఆసియాలో ఎక్కువగా పండిస్తారు. వీటిని ఉడికించి తినవచ్చు. ఇందులో డైకాన్ విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. టారో రూట్ వెజిటేబుల్ పాలినేషియన్, హవాయి వంటకాల్లో చాలా ఫేమస్. ఇందులో కార్బొహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీర్ఘచతురస్కాకారంలో ఉండే స్క్వాష్ తియ్యగా ఉంటుంది. కాల్చి స్టఫ్ గా తినొచ్చు. విటమిన్ ఎ,సి, ఫైబర్ ఉంటుంది. ఆర్టిచోక్స్ వెజిటేబుల్స్ ను జెరూసలేంలో ఎక్కువగా తింటారు. వగరుగా ఉంటుంది. గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. పియర్ ఆకారంలో ఉండే చాయోటే స్క్వాష్ తియ్యగా ఉంటుంది. ఊరగాయరూపంలో నిల్వ చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.