తలలో చుండ్రు ఉంటే తల దురదగా, అసౌకర్యంగా ఉంటుంది. చిన్నచిన్న ఇంటి చిట్కాలతో దీన్ని నివారించవచ్చు. కొబ్బరినూనెతో మాడుకు పోషణ లభిస్తుంది. పొడిబారకుండా ఉంటుంది. ఫలితంగా చుండ్రు నివారించబడుతుంది. కొబ్బరినూనెలో కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగిస్తే చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మాడు మీద ఫంగస్ పెరగకుండా నివారిస్తుంది. బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది మాడు మీద మృత కణాలు తొలగిస్తుంది. పెరుగులో ప్రొబయోటిక్స్, లాక్టిక్ ఆసిడ్ ఉంటాయి. ఇవి స్కాల్ప్ కు పోషణ అందించి చుండ్రు తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్ మసాజ్‌తో మాడు హైడ్రేటెడ్ గా ఉంటుంది. చుండ్రు కారణమయ్యే మాడు పొడిబారే సమస్య రాదు. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.