సమ్మర్ మొదలైంది.హైడ్రెటెడ్ గా ఉండేందు ఈ డ్రింక్స్ తాగండి. ఆమ్ పన్నాను మామిడిపండ్లు, జీలకర్ర, జీర, పుదీన వేసి తయారు చేస్తారు. ఎండలో మంచిశక్తినిస్తుంది. జల్జీరాను నీటిలో జీరాను కలిపి తయారు చేస్తారు. జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారికి మంచి ఎంపిక. సత్తు షర్బత్ ను సత్తుపిండి, చక్కెర, నీటితో కలిపి తయారు చేస్తారు. సమ్మర్ లో రిఫ్రెష్ గా ఉంటుంది. మజ్జిగను పెరుగుతో తయారు చేస్తారు. మండే ఎండాకాలంలో మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరినీళ్లు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఎండాకాలంలో ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగడం మంచిది. చెరుకు రసం అనేక సమస్యలకు సహజనివారణిగా ఉపయోగపడుతుంది. లస్సీ క్రీము పెరుగుతో తయారు చేస్తారు. అవకాడో, మామిడి, అరటి, వాల్నట్ లస్సీని తాగవచ్చు. బార్లీనీరు అరోగ్యానికి అమృతం వంటివి. ఇందులో నీళ్లు, తేనె, ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. నిమ్మరసంలో పుదీనా, చక్కెర, ఉప్పు కలిపి తయారుచేస్తారు. ఎండాకాలంలో చక్కటి రెసిపి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.