సమ్మర్​లో విరివిగా దొరికే ఫుడ్స్​లో తాటి ముంజలు ఒకటి.

వీటిని సమ్మర్​లో తీసుకుంటే వేడి తగ్గి.. చలువ చేస్తుంది. అందుకే దీనిని ఐస్ యాపిల్ అంటారు.

తాటిముంజల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఎనర్జీని కూడా ఎక్కువగా ఇస్తాయి.

ఇవి వేడివల్ల కలిగే చెమట పొక్కులు రాకుండా కాపాడుతాయి. వాటినుంచి ఉపశమనం ఇస్తాయి.

ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్​కు గురికాకుండా చేస్తుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకుంటే చాలా రిలీఫ్​గా ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. లివర్​ ఆరోగ్యాన్ని మెరుగుపరస్తుంది.

వీటిని నేరుగా తినొచ్చు లేదా స్మూతీ, జ్యూస్ చేసుకుని తాగవచ్చు.

Images Source : Pinterest