మాంసాహారం తినడంలో తెలుగు రాష్ట్రాలే టాప్!

ఈ రోజుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు ఎక్కువగానే ఉన్నారు.

తాజాగా మాంసాహారం ఎక్కువగా తినే రాష్ట్రాల లిస్టును NFHS విడుదల చేసింది.

ఈ నివేదికలో తెలంగాణ ఫస్ట్, ఏపీ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి.

తెలంగాణలో 98.7 శాతం, ఏపీలో 98.25 శాతం మంది నాన్ వెజ్ తింటున్నట్లు తెలిపింది.

మాంసం ధరలు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ మార్కెట్లో మటన్ ధర రూ. 500 నుంచి రూ. 600 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 1000 ఉన్నట్లు తెలిపింది.

ప్రతి కుటుంబం మాంసం కోసం ఏటా రూ. 58 వేలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. All Photos Credit: pexels.com