ఉసిరికాయలతో జామ్.. టేస్టీ రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఉసిరికాయ విటమిన్ సి కి మంచి ఆధారం. ఇది తినడానికి చాలా రుచికరమైనది. ఆరోగ్యానికి ఉపయోగకరమైనది.

Image Source: pixabay

ఆమ్లాను సలాడ్, కూరగాయలు లేదా చట్నీ రూపంలో తింటారు. కానీ టేస్టీగా తినాలనుకుంటే జామ్ రూపంలో తీసుకోవచ్చు.

Image Source: pixabay

ఉసిరి జామ్​ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది అంత సులభంగా పాడవ్వదు.

Image Source: freepik

మరి ఇంట్లో ఈ టేస్టీ ఉసిరికాయ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

Image Source: pixabay

ఒక కిలో ఫ్రెష్ ఉసిరికాయలను తీసుకుని కడిగి.. పూర్తిగా ఆరబెట్టి.. ఫోర్క్​తో చిల్లులు పెట్టండి.

Image Source: pexels

ఇప్పుడు పెద్ద పాత్రలో నీటిని వేడి చేసి.. ఉసిరికాయలను వేసి.. అవి మెత్తబడే వరకు 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించాలి.

Image Source: pexels

పాకం కోసం ఒక మందపాటి అడుగున గల పాత్రలో 1 కిలో చక్కెర, 1 నుంచి 2 కప్పుల నీరు వేసి చక్కెర కరిగే వరకు వేడి చేయండి.

Image Source: pexels

చక్కెర కరిగిన తరువాత ఉడికించిన ఉసిరికాయలను వేసి.. చిన్న మంట మీద 30 నుంచి 40 నిమిషాల వరకు బాగా ఉడికించాలి.

Image Source: pexels

ఉసిరి రంగు పూర్తిగా మారి.. పాకం తేనెలా చిక్కబడే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకుని వాడుకోవడమే .

Image Source: pexels