ఉదయాన్నే ఇది తాగితే మలబద్ధకం దూరం

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పొట్ట ఎంత ప్రశాంతంగా ఉంటే.. రోజు అంతా బాగుంటుంది. కాబట్టి మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలి.

Image Source: pexels

ఉదయం లేవగానే 1-2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగులు శుభ్రం అవుతాయి.

Image Source: pexels

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image Source: pexels

రాత్రిపూట చిటికెడు ఇంగువను నీటిలో నానబెట్టి.. ఉదయం పరగడుపున సేవించండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

Image Source: pexels

ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు కలిపి తాగితే పేగుల సరళతకు చాలా మంచిది.

Image Source: pexels

ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. ఫైబర్ లోపం తీరుతుంది.

Image Source: pexels

వేసవిలో పుదీనా ఆకులు, నిమ్మరసం జీర్ణవ్యవస్థను శాంతపరుస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Image Source: pexels

ఉదయం నీరు తాగిన తరువాత 15-20 నిమిషాల నడక పేగుల కదలికను పెంచుతుంది.

Image Source: pexels

జీరా నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.

Image Source: pexels