సగ్గుబియ్యం ఏ చెట్టునుంచి తయారు చేస్తారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

చాలామంది ఉపవాస సమయంలో సగ్గుబియ్యం తింటారు.

Image Source: freepik

సగ్గుబియ్యాన్ని కిచిడి, ఖీర్ లేదా టిక్కీలు చేసి ఉపవాస సమయంలో తింటారు. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

Image Source: freepik

కానీ మీరు ఎప్పుడైనా సగ్గుబియ్యం ఏ చెట్టు నుంచి వస్తుందో, ఉపవాసాలలో ఎందుకు తింటారో తెలుసా?

Image Source: freepik

మరి ఏ మొక్క గుజ్జుతో వీటిని తయారు చేస్తారో.. ఎలా చేస్తారో చూసేద్దాం.

Image Source: pexels

సగ్గుబియ్యం ప్రధానంగా కర్రపెండ్లం అనే చెట్టు వేరు గుజ్జుతో తయారు చేస్తారు.

Image Source: pexels

మొద్దుగా ఉండే కాండం కలిగిన దానిని మధ్యలో చీల్చి.. గుజ్జును తీసి, వేడి చేసి సగ్గుబియ్యం తయారు చేస్తారు.

Image Source: freepik

వీటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాన్ని టాపియోకా రూట్ అంటారు. దీనిని కసావా అని కూడా పిలుస్తారు.

Image Source: pexels

వేరు గుజ్జు నుంచి స్టార్చ్ తీసి.. దానిని గుండ్రని పూసలుగా తయారు చేస్తారు.

Image Source: freepik

అలాగే వాటిని ఎండబెట్టి.. గ్లూకోజ్ లేదా స్టార్చ్తో చేసిన పొడితో పాలిష్ చేసి సగ్గుబియ్యం తయారు చేస్తారు.

Image Source: pexels