కాలేయం, కిడ్నీల ఆరోగ్యం కోసం ఈ కూరగాయలు తినేయండి

కాలేయం, మూత్రపిండాలు శరీరంలోని మలినాలు బయటకు పంపేందుకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి వాటని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

బ్రోకలీ, వెల్లుల్లి, బీట్రూట్ వంటి కూరగాయలు తీసుకోవాలి. వీటిలో కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే పోషకాలు ఉన్నాయి.

USA వెబ్సైట్ హెల్త్లైన్ నివేదిక ప్రకారం.. మన ఆహారంలో కాలేయం ,మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే, వాటి పనితీరును మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకోవాలట.

కాబట్టి మీ డైట్లో బ్రోకలీ, క్యాబేజీ వంటి కూరగాయలను చేర్చాలి.

ఈ కూరగాయలు వాటి గ్లూకోసినోలేట్ల కారణంగా కిడ్నీ, లివర్ హెల్తీగా ఉండేలా చేస్తాయి.

ఈ కూరగాయలలో పీచు, విటమిన్ సి, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

వెల్లుల్లి ఆరోగ్యం కోసం చాలా ఉపయోగకరమైనదిగా చెప్తారు.

వెల్లుల్లి కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

వెల్లుల్లిలో అల్లిసిన్, ఇతర జీవక్రియల వంటి సేంద్రీయ సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి.

అలాగే మీ ఆహారంలో కొద్దిగా బీట్‌రూట్‌ తీసుకోవడం మర్చిపోవద్దు.

బీట్రూట్లో సహజ బీటాలైన్స్, నైట్రేట్స్ మంచి మోతాదులో ఉంటాయి.

బీట్రూట్ జీవక్రియ ఆరోగ్యాన్ని, రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.