సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొన్ని లక్షణాలు సైలెంట్ హార్ట్ ఎటాక్ని సూచిస్తాయంటున్నారు నిపుణులు. జలుబు, కండరాల్లో నొప్పులు సైలెంట్ హార్ట్ ఎటాక్‌కి సంకేతాలు. బ్యాక్ పెయిన్, దవడ భాగల్లో ఇబ్బంది, అలసట కూడా దీని లక్షణాలే. ఈ రకమైన లక్షణాలు గుర్తిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి అంటున్నారు. బరువు ఎక్కువగా ఉండేవారు.. బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహం, ఒత్తిడి, పొగాకు తాగేవారికి కూడా ఇది వచ్చే అవకాశముంది. ఇవి కేవలం అవగాహన కోసమే. సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. (Images Source : Unsplash/Pexels)