టమాటలు ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయా? టమాటలు ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టమాటలో సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉంటాయి. టమాటలు ఎక్కువ తింటే పేగులలో ఆమ్లత్వాన్ని నింపుతాయి. అంతేకాదు, గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తి పెరిగి గుండెల్లో మంట ఏర్పడుతుంది. టమాటలోని ఆల్కలాయిడ్స్ కీళ్ల వాపు, నొప్పిని పెంచే అవకాశం ఉంటుంది. టమాటాలు ఎక్కువ తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టమాటల్లోని పొటాషియం, ఆక్సలైట్ కంటెంట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. టమాటలను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com