రాత్రి భోజనం వీలైనంత త్వరగా చెయ్యాలి. తిన్నాక కొద్దిగా నడిస్తే చాలా లాభాలు ఉన్నాయట. రాత్రి భోజనం తర్వాత నడిస్తే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. డిప్రెషన్ దరిచేరదు. రాత్రి భోజనం అయ్యాక కాసేపు చేసే వాకింగ్ వల్ల సర్కాడియన్ రిథమ్ సంతులనం అవుతుంది. అందువల్ల మంచి నిద్ర వస్తుంది. రాత్రి భోజనం తర్వాత నడిస్తే బీపి అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తనాళాల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. డిన్నర్ తర్వాత చేసే వాకింగ్ తో జీవక్రియల వేగం పెరుగుతుంది. కాలరీలు ఖర్చు అవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. డిన్నర్ తర్వాత వాకింగ్ తో రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. జీర్ణక్రియ సజావుగా జరిగి పోషకాల శోషణ పూర్తిగా జరుగుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.