తియ్యని కమ్మని వాసనతో పనసతొనలు చాలా రుచిగా ఉంటాయి.

పనసతొనలే కాదు అందులోని గింజలు కూడా చాలా పోషకాలతో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

జాక్లీన్ అనే ప్రొటీన్ పనస గింజల్లో ఉంటుంది. ఇది నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

హెచ్ఐవీ వంటి పెద్ద ఇన్ఫెక్షన్లను సైతం ఎదుర్కొనే శక్తి సంతరించుకుంటుంది.

పనసగింజల పొడిలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

హీమోగ్లోబిన్ సింథసిస్ కి ఎనిమియా తగ్గించుకునేందుకు పనస గింజలు చాలా ఉపయోగకరం.

పనసగింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. వీటిలోని విటమిన్ C ఎండవల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

పనసగింజల్లో విటమిన్ A ఎక్కువ. అందువల్ల కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

పనసగింజల యాంటీమైక్రోబియల్ లక్షణాల వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. రక్త ప్రసరణ మెరుగై జుట్టు పెరుగుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే