ఆడవారిని హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంచే ఫుడ్స్ ఇవే
వివిధ కారణాల వల్ల ఆడవారికి స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. త్వరగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
అయితే కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు స్ట్రెంత్ పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.
పాలకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది.
పీరియడ్స్ సమస్యలను దూరం చేయడంతో పాటు ఇమ్యూనిటీ పెంచడంలో, ఎముకలను స్ట్రాంగ్‌గా చేయడంలో హెల్ప్ చేస్తుంది.
పప్పుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మంచి పోషక ప్రయోజనాలు అందిస్తుంది.
ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కంట్రోల్ చేసి.. బరువును అదుపులో ఉంచుతాయి.
పాలు రెగ్యులర్‌గా తీసుకుంటే ఎముకల సమస్యలు దూరమవుతాయి. ప్రోటీన్, కాల్షియం శరీరానికి పుష్కలంగా అందుతాయి.
బ్రోకలి వంటి ఆకుకూరలు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసి ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి.
బీట్రూట్ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేసి పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది.
బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం నిండుగా ఉంటుంది. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.