జామలో విటమిన్ C మెండుగా ఉంటుంది. ఈ విటమిన్ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందకు తోడ్పడుతుంది.

డయాబెటిక్స్ కి జామ ఒక మంచి ఆహారం. దీనిలో ఉండే ఫైబర్ తోపాటు గ్లైమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ.

జామలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ ఏర్పడదు.

జామలో విటమిన్లు B3,B6 ఉంటాయి. వీటితో మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడి నాడీ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉంటుంది.

జామలో క్యాలరీలు చాలా తక్కువ. జీవక్రియలను మెరుగు పరిచి బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి. జామ ఆరోగ్యకరమైన స్నాక్.

జామలో కెరోటిన్, లైకోపిన్, విటమిన్ A. C ఉంటాయి. కనుక చర్మంలో ముడతలు ఏర్పడవు. రంగు కూడా ఒక ఛాయ పెరుగుతుంది.

విటమిన్ A ఉంటుంది కనుక జామ కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

జామ ఆకు కషాయం తాగితే నెలసరి నొప్పి తగ్గుతుంది. ఒక్కోసారి పెయిన్ కిల్లర్ కంటే బాగా పనిచేస్తుంది కూడా.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే