పిల్లల్లో చాలా మందికి బిస్కట్లు ఇష్టం ఉంటుంది. వీటితో త్వరగా కడుపు నిండుతుంది.

వెంట ఉంచుకోవడం కూడా సులభం. కనుక పెద్దలు పిల్లలకు ఇవ్వడానికి వెనుకాడరు. పిల్లలకు ఇవి ఇవ్వకూడదట.

బిస్కట్లలో ముఖ్యంగా కుకీలలో పోషకాలు తక్కువ. వీటిలో ఉపయోగించేవన్నీ కృత్రిమ పదార్థాలే. క్యాలరీలు కూడా చాలా ఎక్కువ.

బిస్కట్లలో కృత్రిమ చక్కెరలు ఎక్కువ ఉపయోగిస్తారు. ఇవి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

బిస్కట్లు ఎక్కువ తినే పిల్లలకు భవిష్యత్తులో టైప్2 డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉంది. బరువు కూడా పెరగే ప్రమాదం ఉంది.

బిస్కట్లు చాలా వరకు మైదాతో తయారయ్యేవే. మైదా ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. ఇందులో రిఫైండ్ కార్బోహైడ్రేట్లు తప్ప మరేమీ ఉండవు.

పోషకాలు, ఫైబర్ ఉండవు. కానీ ఇవి తిన్నపుడు పిల్లల కడుపు నిండుతుంది. అందువల్ల ఇతర ఆహారం తీసుకోలేరు.

కార్బోహైడ్రేట్లు, అదనపు చక్కెరలు ఉంటాయి. బిస్కట్లూ రోజూ తినే పిల్లల్లో దంతక్షయం వంటి దంత సమస్యలు వస్తాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.