Image Source: pexels

జుట్టు ఊడుతుందా? ఈ సూపర్ ఫుడ్స్ తినండి

గుడ్లు: గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని జింక్, సెలీనియం జుట్టును బలంగా ఉంచుతుంది.

బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్లు, ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉన్నాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

పాలకూర: పాలకూరలో ఐరన్, ఫొలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

చిలగడదుంపలు: జట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చిలకడదుంపలు మెరుగ్గా పనిచేస్తాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

అవకాడో: అవకాడోలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

విత్తనాలు: పొద్దుతిరుగుడు, అవిసె గింజలు జుట్టుకు జింక్, విటమిన్ ఇ, సెలీనియం వంటి పోషకాలను అందిస్తాయి.

గుల్లలు: జుట్టు పెరుగుదలకు, బట్టతల నివారణకు గుల్లలు మీ ఆహారం చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

రొయ్యలు: రొయ్యలలో ప్రొటీన్, విటమిన్ బి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బీన్స్: బీన్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అద్బుతంగా పనిచేస్తుంది.

Image Source: pexels

మాంసం: మాంసం జట్టుకు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.