కోపం ఎక్కువైతే గుండెకు ముప్పు తప్పదా? కోపంతో ఊగిపోయేవారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అంటున్నారు నిపుణులు. కోపం కారణంగా రక్తనాళాల లైనింగ్‌లో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. కోపం సమయంలో రక్తనాళాలు వీక్ గా మారి హృదయ సమస్యలు కలుగుతాయి. కోపం ఎక్కువై ఒక్కోసారి రక్త నాళాలు చిట్లిపోయే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఉద్వేగాలు గుండె ముప్పుకు కారణం అవుతాయి. ఆందోళన, విచారం కూడా హృద్రోగ ముప్పును పెంచుతాయి. వీలైనంత వరకు మానసిక ఆందోళనకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా ఉండటం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com