మంచినీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదా? నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది అంటారు. కానీ, మోతాదుకు మించి నీళ్లు తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఓవర్ హైడ్రేషన్ ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు. శరీరంలో నీరు ఎక్కువ అయితే సోడియం లెవెల్ తగ్గుతుంది. వాంతులు, కండరాల బలహీనత,తలనొప్పి ఏర్పడుతాయి. కొన్నిసార్లు శరీరంలో నీరు ఎక్కువ కావడం వల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సరిపడ నీరు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది. రోజుకు సుమారు 5 లీటర్ల వరకు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com