టీవీ చూస్తూ తింటున్నారా? ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి, లేకపోతే.. ఈ రోజుల్లో.. బుల్లి పెట్టేల్లో బోలెడు వినోదం దొరుకుతోంది. ఓటీటీలు, టీవీ చానళ్లు ఇలా ఎన్నో. స్మార్ట్ టీవీలు వచ్చాక.. ఏది కావాలంటే అది చూస్తూ టైంపాస్ చేసేయడం అలవాటైపోయింది. చివరికి భోజనం చేస్తున్నప్పుడు కూడా కళ్ల ముందు టీవీలో ఏదో ఒక కార్యక్రమం నడుస్తూ ఉండాల్సిందే. మరి, అలా టీవీ చూస్తూ భోజనం చెయ్యడం.. ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఏం జరుగుతుంది? టీవీ చూస్తూ తినడం వల్ల మనం ఎంత తింటున్నామో మనకే తెలీదట. దాని వల్ల ఎక్కువ తినేస్తామట. టీవీ చూడటం వల్ల పరధ్యానంగా ఉంటారట, ఎంత సేపు తింటున్నామో కూడా తెలియదట. అలాగే టీవీ చూస్తూ తినడం వల్ల చాలామందికి రుచి కూడా తెలియడం లేదట. మీ ఇంట్లో పిల్లలు స్కూల్‌లో లంచ్ బాక్స్ పూర్తిగా తినకపోవడానికి కూడా కారణం కూడా.. టీవీ అలవాటే. టీవీలలో వచ్చే కార్యక్రమం ఆసక్తికరంగా ఉంటే తక్కువగా తిని, త్వరగా భోజనం ముగించడం కూడా ముప్పే. బాగా తినడం, పరధ్యానంతో తినడం, తక్కువ తినడం.. ఇవన్నీ స్లో పాయిజన్‌లా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.