ఖాళీ కడుపుతో బాదం తింటే ఎన్ని ప్రయోజనాలో



బాదంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

ఉదయాన్నే బాదంపప్పు తింటే జీర్ణక్రియ రేటు పెంచడంలో సహాయపడతుంది. క్యాలరీలు బర్న్ అవుతాయి.

ఖాళీ కడుపుతో బాదం తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలను గ్రహించేలా చేస్తాయి.

బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కర స్థాయిలను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడుతుంది.

బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న బాదం ఆకలిని తగ్గిస్తుంది. కేలరీలను తగ్గించడంతోపాటు బరువును కంట్రోల్లో ఉంచుతుంది.

బాదంలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు నరాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అభిజ్నా విధును మెరుగుపరుస్తుంది.

బాదంలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, వాపును తగ్గిస్తాయి. వ్రుద్దాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

Image Source: pexels

బాదంలోని విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరాన్ని అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది.