జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ఈ టిప్స్ పాటించండి ఈ రోజుల్లో చాలా మందికి ఎదురవుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. రాలిపోయే జుట్టు కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మానసిన ఒత్తిడి, పోషకాహార లోపంతో జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. చక్కటి ఆహారం, మంచి నిద్ర, రోజూ వ్యాయమంతో జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానానికి ముందు జుట్టుకు నూనె పెట్టుకుని మసాజ్ చేయడం వల్ల హెయిర్ హెల్తీగా ఉంటుంది. కెమికల్స్ ఎక్కువగా వినియోగించే షాంపులు, కండీషనర్లను వాడకూడదు. హెయిర్ డ్రయ్యర్లు, కర్లర్స్ జుట్టు చిట్లిపోయి, ఊడిపోయే అవకాశం ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com