సమ్మర్లో బయట కొంతసేపు గడిపినా స్కిన్ టాన్ అయిపోతుంది. టాన్ వదిలించుకోవడం కష్టమనుకుంటున్నారేమో.. కానీ కొన్ని సింపుల్ టిప్స్‌తో దానిని వదిలించుకోవచ్చు. నిమ్మరసంలో తేనే కలిపి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి కడిగేస్తే మంచిది. అలోవెరా జెల్ స్కిన్టాన్ను సులువుగా తొలగిస్తుంది. ఫ్రెష్ది వాడితే మంచిది. బంగాళదుంపల జ్యూస్‌ను టాన్ రిమూవ్ చేయడానికే కాకుండా స్కిన్ బెనిఫిట్స్‌కి కూడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌గా అప్లై చేసే టాన్ తొలగిపోతుంది. కీరదోస జ్యూస్ కూడా టాన్ తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసుపు, పెరుగు కలిపి అప్లై చేస్తే మీరు స్కిన్‌కి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)