సమ్మర్​లో గ్లోయింగ్ స్కిన్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

సమ్మర్​లో స్కిన్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గ్లోయింగ్ స్కిన్ కావాలనుకునేవారు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకునేందుకు కచ్చితంగా నీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇది స్కిన్ హెల్తీగా ఉంచేలా చేస్తుంది.

తేలికగా ఉండే మాయిశ్చరైజర్​ని ఎంచుకోవాలి. ఆయిల్​ ఫ్రీ అయితే పింపుల్స్ సమస్యలు కూడా రావు.

వారానికి ఒకటి రెండుసార్లు స్కిన్​ని ఎక్స్​ఫోలియేట్ చేయాలి. ఇది మృతకణాలను తొలగించి స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

స్కిన్​ను ఎండనుంచి కాపాడుకోవడానికి సన్​స్క్రీన్​ను కచ్చితంగా ఉపయోగించాలి. రెండుగంటలకోసారి అప్లై చేయాలి.

కీరదోసం పెరుగును మిక్సీ చేసి.. దానినితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్​కి హైడ్రేషన్ బయటనుంచి అందుతుంది.

తేనె, పసుపు కలిపి.. ముఖానికి అప్లై చేస్తే స్కిన్ మెరుగుస్తుంది. డల్​నెస్ తగ్గుతుంది.

అలోవెరా జెల్, రోజ్ వాటర్​ కూడా స్కిన్​హెల్త్​కి మంచివి. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.