వేసవిలో వచ్చే వ్యాధులివే, కొన్ని ప్రాణాలు కూడా తీస్తాయ్!

చలికాలంలో వ్యాధులు సహజమే. అనేక బ్యాక్టీరియాలు, వైరస్‌లు యాక్టీవ్‌గా ఉంటాయి.

అలాగని సమ్మర్‌లో హ్యాపీగా ఉండొచ్చని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే, వేసవి కూడా డేంజరే.

తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురికావచ్చు. దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

డయాబెటిస్, గుండె సమస్యలో ఉన్నవారు.. తప్పకుండా వేసవిలో జాగ్రత్తగా ఉండాలి.

ఎండలో ఎక్కువగా తిరిగితే యూవీ రేస్‌కు గురికావచ్చు. దానివల్ల చర్మం పాడవుతుంది.

వేడి వాతావరణంలో ప్రమాదకర బ్యాక్టీరియా యాక్టీవ్‌గా ఉంటుంది. కాబట్టి, ఫుడ్ విషయంలో జాగ్రత్త.

వేసవిలో బయటి ఆహారం తినొద్దు. నిల్వ ఆహారం కూడా తినొద్దు. ఫుడ్ ఫాయిజనింగ్ కావచ్చు.

డీహైడ్రేషన్‌కు గురికాకుండా నిత్యం వాటర్ తాగుతుండాలి. వదులైన, కాటన్ దుస్తులు ధరించాలి.

Images Credit: Pexels