సమ్మర్​లో వర్షాలు వస్తే సమ్మగానే ఉంటుంది. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివా? కాదా?

సమ్మర్​లో వర్షం వస్తే గాలి క్లీన్ అవుతుంది. ఇది డస్ట్ వల్ల వచ్చే సమస్యలను దూరం చేస్తుంది.

ఉష్ణోగ్రతలు కంట్రోల్ అవుతాయి. వేడివల్ల ఒత్తిడి, హీట్ స్ట్రోక్​ సమస్యలను తగ్గుతాయి.

ఎండలతో అలసిపోయినప్పుడు వర్షం మంచి ప్రశాంతతను అందిస్తుంది. యాంగ్జైటీ దూరమవుతుంది.

అయితే సమ్మర్​లో సడెన్​గా వర్షం వస్తే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

వర్షం వచ్చిన తర్వాత నిలిచిపోయిన నీరు కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులకు కారణమవుతుంది.

వర్షపు నీటిలో డెంగ్యూ, మలేరియా, చికెన్​ గున్యాను వ్యాపింపచేసే దోమలు పెరుగుతాయి.

వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తీవ్రమవుతాయి.

స్కిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫంగల్ సమస్యలు ట్రిగర్ అవుతాయి.

సమ్మర్లో వచ్చే వానల్లో తడకపోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు.