కీరదోస ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే దీనిని డైట్​లో చేర్చుకుంటారు.

అయితే కీరదోసను రాత్రుళ్లు తింటే మంచిదేనా? ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా?

రాత్రుళ్లు కీరదోస తింటే కఫ సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెప్తున్నారు.

ఎందుకంటే కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కఫాన్ని పెంచుతుంది.

అంతేకాకుండా దోసకాయ శీతలీకరణ ప్రభావం చూపిస్తుంది కాబట్టి జలుబు వచ్చే అవకాశం కూడా ఉంది.

కాబట్టి రాత్రుళ్లు దోసకాయ తినడం వల్ల ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోవచ్చు.

రాత్రుళ్లు కీరదోస తినడం వల్ల పేగు కదలికపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది నిద్రను దూరం చేస్తుంది.

కాబట్టి నిపుణులు రాత్రుళ్లు కీరదోసకు దూరంగా ఉండడమే మంచిదని చెప్తున్నారు.

అలాగే దీనిని పగలు తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.