కళ్లజోడు అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. సైట్ వల్ల స్పెక్స్ ఎక్కువగా వాడుతారు.

స్క్రీన్ ఎక్కువ చూడడం, వయసు, ఇతర కారణాల వల్ల చాలామందికి సైట్ వస్తుంది.

మీకు డాక్టర్ టెస్ట్ చేసి.. ఎలాంటి కళ్లజోడు వాడమంటారో.. వాటిని ఎంచుకోవడం చాలామంచిది.

మీరు ఎంచుకునే లెన్స్ కూడా చాలా ముఖ్యం. స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించేవారు బ్లూ లైట్ ఫిల్టర్ లెన్స్​ ఎంచుకోవాలి.

మీ ముఖానికి ఏ కళ్ల జోడు సూట్ అవుతుందో తెలుసుకోవాలి. దానికి తగ్గట్లు ఎంచుకోవాలి.

మీది రౌండ్ ఫేస్ ఉంటే రెక్టాంగ్యూలర్, యాంగ్యూలర్ ఫ్రేమ్స్ ఎంచుకోవచ్చు.

స్క్వేర్ ఫేస్ ఉన్నవారు రౌండ్, ఓవల్ ఫ్రేమ్స్ ఎంచుకోవచ్చు. ఓవెల్ ఫేస్ ఉన్నవారు స్టైలిష్ ఫ్రేమ్స్ ఎంచుకోవచ్చు.

మీరు రోజూ కళ్లజోడు పెట్టుకునేవారు అయితే లైట్​ వైయిట్ మెటిరియల్స్ ఎంచుకోవచ్చు.

మీ కళ్లజోడు కంఫర్ట్​గా, ఫిట్​గా ఉండేలా చూసుకోవాలి. చెవి దగ్గర నొక్కి ఉంచే వాటిని వాడకపోవడమే మంచిది.

సైట్ పెరిగిందనిపిస్తే కచ్చితంగా దానిని వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది.