టాయిలెట్ సీట్స్ కూడా పేలుతాయట.. జాగ్రత్త

ఏసీ, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలుతాయని అందరికీ తెలుసు. కానీ టాయిలెట్స్ కూడా పేలుతాయట తెలుసా?

అవును మీరు విన్నది నిజమే. టాయిలెట్ సీటు కూడా పేలుతుందట. కారణాలేంటో చూసేద్దాం.

టాయిలెట్ సీట్ పేలుళ్లకు అత్యంత కామన్ రీజన్ గ్యాస్.

బయోగ్యాస్, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు పైపులో పేరుకుపోతూ ఉంటాయి.

ఈ వాయువుల పరిమాణం లిమిట్​ దాటినప్పుడు ఈ పేలుడు ప్రమాదం పెరుగుతుందట.

ఇదే కాకుండా బాత్రూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, హీటర్ వాడడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు.

కాబట్టి మీరు టాయిలెట్స్​ని వీలైనంత శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

వాష్​ రూమ్​లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే అయినా.. వాష్​ రూమ్​ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మంచిది.