సమ్మర్​లో వేడి వల్ల తలలో చెమట ఎక్కువ పట్టి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అందుకే తలస్నానం చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

తలకు మాస్క్​ అప్లై చేస్తే జుట్టుకు రక్షణ అందుతుంది. వేడి వల్ల జరిగిన డ్యామేజ్, డ్రైనెస్ రిపేర్ అవుతుంది.

తలస్నానం చేసేముందు మీ జుట్టును బ్రష్ చేసుకోవాలి. జుట్టు చిక్కులు లేకుండా ఉంటే హెడ్ బాత్ సమయంలో ఈజీగా ఉంటుంది.

మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూను ఎంచుకోవాలి. సున్నితమైన షాంపూలు స్కాల్ప్ హెల్త్​కి మంచివి.

మరీ వేడి నీళ్లతో కాకుండా.. గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది.

చెమటపడుతుంది కదా అని రోజూ తలస్నానం చేయకూడదు. వారానిరి రెండు, మూడుసార్లు చేస్తే చాలు.

జుట్టుకు కచ్చితంగా కండీషనర్​ను అప్లై చేయాలి. ఇది జుట్టుకు మాయిశ్చరైజర్​ని ఇచ్చి.. హెల్తీగా ఉండేలా చేస్తుంది.

పొడి టవల్ లేదా మైక్రోఫైబర్ టవల్​తో తడి జుట్టును చుట్టాలి. తర్వాత లీవ్ ఇన్ కండీషనర్​ వాడొచ్చు.

సీరమ్, కండీషనర్ ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పొడిబారడం తగ్గుతుంది.

జుట్టును స్టైలింగ్ చేయకపోవడమే మంచిది. దీనివల్ల జుట్టు మరింత రాలిపోయే ప్రమాదముంది.