ప్రెగ్నెన్సీ సమయంలో చెరకు రసం తాగవచ్చా?

గర్భంతో ఉన్నప్పుడు చెరకు రసం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయట.

దీనిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

అంతేకాకుండా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి.

ఇవన్నీ కడుపులోని బేబి పెరుగుదలను మెరుగుపరుస్తాయి.

ప్రెగ్నెన్సీలో వచ్చే మలబద్ధకం, జీర్ణ సమస్యలను ఇది దూరం చేస్తుంది.

శక్తిని అందించి నీరసాన్ని, కళ్లు తిరగడాన్ని దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచి ఇన్​ఫెక్షన్లు సోకకుండా చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి సూచనలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)