షుగర్ మానేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. ముఖ్యంగా బరువు తగ్గేవారు దీనిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.

కాబట్టి షుగర్​ను మీ డైట్​ నుంచి కట్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

మీరు తీసుకునే ఫుడ్​లో యాడెడ్ షుగర్స్ లేకుండా.. షుగర్ తక్కువగా ఉండేవాటిని తీసుకోవాలి.

ఇంట్లోనే వంట చేసుకుంటే షుగర్​ని మీరు కంట్రోల్ చేయడానికి వీలు ఉంటుంది.

ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా పండ్లు, కూరగాయలు, విత్తనాలు డైట్​లో చేర్చుకోవచ్చు.

షుగర్ డ్రింక్స్, సోడాలు మానేస్తే మంచిది. టీలు, కాఫీల్లో షుగర్ తగ్గించుకోవాలి.

ఒకేసారి షుగర్​ లేదా స్వీట్స్ తీసుకోవడం మానేయకుండా కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉండాలి.

సహజంగా దొరికే తేనెను చక్కెరకు బదులుగా తీసుకోవచ్చు. ఇది షుగర్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది.

స్వీట్స్ తినాలనిపించినప్పుడు మీరు పండ్లు తినొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.