నిద్రపోవడంలో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి.

త్వరగా నిద్ర రావడానికి 4-7-8 టెక్నిక్​ ఫాలో అవ్వొచ్చు. దీనిలో ఏంటి చేస్తారో చూసేద్దాం.

4 సెకన్లు శ్వాస పీల్చుకోవాలి.. 7 సెకన్లు దానిని హోల్డ్ చేయాలి. 8 సెకన్లు స్లోగా దానిని వదలాలి. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది.

నిద్రకు కనీసం అరగంట నుంచి గంట ముందు స్క్రీన్స్ ఉపయోగించడం మానేస్తే మంచిది.

సాయంత్రం 4 లేదా 5 తర్వాత కెఫిన్ తీసుకోకపోవడమే మంచిది. ఇది నిద్రకు భంగం కల్పిస్తుంది.

మీరు పడుకునే రూమ్​ని మీరు కంఫర్ట్​బుల్​గా ఉండే టెంపరేచర్​లో ఉంచుకోండి. డార్క్​ రూమ్ మంచిది.

రోజూ స్లీప్​ రొటీన్​ని సెట్ చేసుకోండి. నిద్ర వచ్చినా రాకున్నా ఆ సమయానికి పడుకోవడం, లేవడం చేయాలి.

పడుకునే ముందు హెర్బల్ టీలు, గోరువెచ్చని పాలు తాగితే శరీరం రిలాక్స్​ అయి నిద్రను ఇస్తుంది.

బుక్ చదవడం, జర్నల్ రాయడం, సాంగ్స్ వినడం వంటివి చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది.

బెడ్​ మీద పడుకుని టీవీ చూడడం, వర్క్ చేయడం వంటివి చేయకూడదు. కేవలం నిద్రకు మాత్రమే ఉపయోగించాలి.