చాలామంది సమోసాలను ఇష్టంగా తింటారు. పైగా బయట తయారు చేసేవి ఇంకా రుచిగా అనిపిస్తాయి.

అయితే వీటిని ఇంట్లో తయారు చేయడం చాలా కష్టమనుకుంటారు. కానీ వీటిని ఇంట్లో కూడా ఈజీగా చేయవచ్చు.

ముందుగా పిండి, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో నీరు వేసి పిండి కలిపి అరగంట పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో నూనె వేయాలి. వేడి అయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

ఉడికించిన బంగాళదుంపలను, బఠాణీలను, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.

ఇప్పుడు స్టౌవ్ ఆపేసి దానిలో తురిమిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలను చల్లారనివ్వాలి.

ముందుగా తయారు చేసుకున్న పిండిని ఇప్పుడు చిన్న సైజ్ బాల్స్​గా తయారు చేసుకోవాలి.

వీటిని చిన్న చపాతీలుగా ఒత్తుకుని సమానంగా కట్ చేసుకోవాలి. వీటిని కోన్ రూపంలో చుట్టుకోవాలి.

ఇప్పుడు ముందుగా తయారు చేసిన బంగాళదుంప మిశ్రమాన్ని దానిలో స్టఫ్ చేయాలి.

నీటిని చేతికి అద్దుకుని చివర్లు ఒత్తుకోవాలి. స్టఫ్ బయటకి రాకుండా హెల్ప్ చేస్తుంది.

ఇప్పుడు మొత్తం సమోసాలు రెడీ చేసుకుని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేసుకోవాలి.

అది వేగిన తర్వాత సమోసాలను వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్, క్రిస్పీగా వేయించుకోవాలి. అంతే సమోసాలు రెడీ.