కలబంద చెట్లు లేని వారు మార్కెట్లనుంచి అలొవెరా జెల్‌ను కొనుక్కుంటారు. కలబంద చెట్టు దొరికినప్పుడు దానిని గుజ్జు తీసి మీరు ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్ కలబంద గుజ్జును సింపుల్ టిప్స్‌తో ఎలా స్టోర్ చేయవచ్చో చూద్దాం. అలొవెరా గుజ్జును ఐస్ ట్రైలో వేసి ఫ్రీజర్‌లో ఉంచవచ్చు. ఈ క్యూబ్స్‌ను మీరు సన్‌టాన్, డ్రై స్కిన్ దూరం చేసుకోవడానికి వాడుకోవచ్చు. విటమిన్ ఈ ఆయిల్‌తో కలిపి దానిని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయవచ్చు. అలొవెరాకు సమానంగా తేనెను బాగా కలిపి స్టోర్ చేయవచ్చు. విటమిన్ సి కలిపిన కలబంద గుజ్జు నెలరోజులు నిల్వ ఉంటుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)