ముస్లింలు రంజాన్​ మాసంను చాలా పవిత్రమైన నెలగా భావిస్తారు.

అందుకే పెద్దల నుంచి పిల్లలవరకు అందరూ ఉపవాసం చేస్తూ ఉంటారు.

ఉదయం, సాయంత్రం నమాజ్ చేసి.. అల్లాహ్​కు ప్రార్థనలు చేస్తారు.

మహిళలు కూడా రంజాన్ సమయంలో ఉపవాసం చేసి నమాజ్ చేస్తూ ఉంటారు.

ఈ సమయంలో పీరియడ్స్ వస్తే ఓ పనిని వారు కచ్చితంగా చేస్తారట.

పీరియడ్స్ సమయంలో మహిళలు వీక్​గా ఉంటారు కాబట్టి.. ఉపవాసానికి బ్రేక్ ఇస్తారట.

ఉపవాసం మానేసిన రోజులకు ఫలితంగా ఖదాను పాటిస్తారట.

అంటే రంజాన్ నెల అయిపోయిన తర్వాత మహిళలు ఎన్ని రోజులైతే ఉపవాసం చేయలేదో.. అన్నిరోజులు పరిహారం చేస్తారట.

స్త్రీ ఖదా చేయకపోతే అది షరియా ప్రకారం పాపంగా పరిగణిస్తారట.

అందుకే రంజాన్ తర్వాత ఎన్నిరోజులు ఉపవాసం చేయకుంటే అన్ని రోజులు మళ్లీ ఉపవాసం ఉంటారట.