ఈ మధ్యకాలంలో టీనేజర్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారిలో కూడా మానసిక రుగ్మతలు ఎక్కువ అవుతున్నాయి. ఎగ్జామ్స్, టెస్ట్‌లలో పాస్ కాలేమనే భయం చాలామందిలో ఉంటుంది. దీనివల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. ఫ్రెండ్స్, సోషల్ మీడియా డ్రామా, నెగిటివిటీ కూడా టీనేజర్స్‌పై ఒత్తిడిని పెంచుతుంది. టైమ్ మేనేజ్మెంట్, డెడ్‌లైన్స్, వర్క్‌లోడ్ ఎక్కువ కావడం వల్ల కూడా టీనేజర్స్ ఒత్తిడికి లోనవుతున్నారు. కెరీర్లో ఏది తమకి కావాలో తెలుసుకోక.. మరో కెరీర్‌ని సెలక్ట్ చేసుకుని ఎక్స్ట్రా ప్రెజర్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీని దూరం చేసుకోవచ్చు. తేలికపాటి వ్యాయమం అయినా లేదా రన్నింగ్ వంటి బేసిక్స్‌ని రొటీన్‌గా మార్చుకోవాలి. కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్ర కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరానికి హెల్తీ ఫుడ్‌ని అలవాటు చేయండి. ఒత్తిడిని పెంచే ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. కుదిరితే జిమ్‌కి వెళ్లండి. బాడీమీద ఫోకస్ పెడితే.. బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది.