కొత్తగా పెళ్లయినవారికి భోజనంతోపాటు కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదట భోజనంతోపాటు కూల్ డింక్స్ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారికి, ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినవారికి అస్సలు మంచిది కాదట. ఎందుకంటే.. కూల్ డ్రింక్స్‌లో pH స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా మన శరీరంలో pH లెవెల్స్ 7.5 వరకు ఉంటాయి. కానీ, కూల్ డ్రింక్స్‌లో 2.5 నుంచి 3.5 వరకు ఉంటాయి. అంటే వాటిలో ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ఈ యాసిడ్స్ వల్ల ఆడవాళ్లకు పీరియెడ్స్ క్రమం తప్పుతాయి. దానివల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయి. అంతేకాదు.. కూల్ డ్రింక్స్ వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ లేయర్ పాడవుతుంది. పళ్లు త్వరగా పుచ్చిపోతాయి. కూల్ డ్రింక్‌లో ఉండే షుగర్ కంటెంట్ వల్ల ఒబెసిటీ వస్తుంది. అది అనేక రోగాలకు దారి తీస్తుంది. కాబట్టి, మీ ఇంటికి వచ్చే అతిథులకు కూల్ డ్రింక్స్‌కు బదులు మజ్జిగ లేదా నిమ్మరసం లాంటివి ఇవ్వండి.