ఇయర్ బడ్స్ వాడితే మెదడు సమస్యలు తప్పవా? ఈ రోజుల్లో స్మార్ట్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇయర్ బడ్స్ వాడుతున్నారు. ఈజీగా ఫోన్ మాట్లాడ్డంతో పాటు పాటలు వినేందుకు ఇయర్స్ బడ్స్ వినియోగిస్తున్నారు. అతిగా ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. వినికిడి సమస్యలతో పాటు మెదడు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇయర్ బడ్స్ కారణంగా క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. అతిగా ఇయర్ బడ్స్ వాడటం వల్ల నాడీ సమస్యలతో పాటు లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. ఇయర్ బడ్స్ నుంచి వచ్చే రేడియేషన్ పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అవసరం అయితే తప్ప ఇయర్ బడ్స్ ఉపయోగించకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: Pexels.com