మఖానా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. పాలు కూడా అంతే.

అయితే పాలల్లో మఖానాను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయట.

ప్రోటీన్ శరీరానికి పుష్కలంగా అందుతుంది. కండరాలకు బలం చేకూరుతుంది.

మఖానే, పాలల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బోన్స్ హెల్తీగా ఉండేలా చేస్తాయి.

పాలల్లో నానిన మఖానా సులభంగా జీర్ణమవుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.

మఖానాలో జింక్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి థైరాయిడ్ ఫంక్షన్​ని మెరుగుపరుస్తాయి.

వీటిలోని సోడియం, పొటాషియం బీపిని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

మెరుగైన నిద్రను ఈ కాంబినేషన్ ప్రమోట్ చేస్తుంది. నిద్రకు ముందు తీసుకోవచ్చు.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు హెల్తీ స్కిన్, హెయిర్​ని ప్రమోట్ చేస్తాయి.