జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదట.

కడుపు ఉబ్బరం, గ్యాస్, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలను జీలకర్ర దూరం చేస్తుంది.



దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గట్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ కూడా గట్ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది.



పరగడుపునే బరువు తగ్గడంలో ముఖ్యమైన మెటబాలీజంను పెంచుతుంది.



ఒబెసిటీ పెరగకుండా చేసి.. బాడీలో ఫ్యాట్ పెరగకుండా కాపాడుతుంది.



జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ బ్లడ్​లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి.



రాత్రంతా జీలకర్రను నానబెట్టి తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.



జీలకర్రలోని యాంటీమైక్రోబయాల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.



ఈ డ్రింక్​లోని యాంటీఆక్సిడెంట్లు ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తాయి.



ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.