ధూమపానం ఆరోగ్యంపైనే కాదు.. లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందట.

ధూమపానం వల్ల రక్తనాళాలు దెబ్బతిని.. పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని నిలిపి అంగస్తంభనలో ఇబ్బంది కలిగిస్తాయట.

శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి.. లిబిడో తగ్గిపోతుంది. దీనివల్ల సెక్స్ డ్రైవ్ పూర్తిగా తగ్గిపోతుందట.

నరాలు, రక్తనాళాలపై స్మోకింగ్ నెగిటివ్ ప్రభావాన్ని చూపి.. శీఘ్ర స్కలనంకి దారితీస్తుందట.

స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గించి.. పిల్లలు పుట్టడాన్ని ఆలస్యం చేస్తుందట.

మహిళల్లో కూడా లిబిడో తగ్గి.. సెక్స్ డ్రైవ్​పై ఆసక్తి తగ్గిపోతుందట. తర్వాత యాక్టివ్​గా ఉండలేరట.

యోని పొడిబారడం వల్ల లైంగిక చర్య సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.

మహిళల్లో పొగాకు ఫాలోపియన్ ట్యూబ్స్​పై నెగిటివ్ ప్రభావం చూపి.. ఫెర్టిలిటీ సమస్యలను అధికం చేస్తుందట.

పీరియడ్స్ సైకిల్​పై పొగాకు నెగిటివ్​గా ప్రభావం చూపి.. రెగ్యులర్​గా రాకుండా, ఇబ్బందులు పెంచుతుందట.

అందుకే వీలైనంత త్వరగా స్మోకింగ్​ను మానేయాలని సూచిస్తున్నారు నిపుణులు.