టీ తాగేప్పుడు సిగరెట్ తాగుతున్నారా? అయితే ఇది మీకోసమే

చాలామందికి టీ తాగేప్పుడు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది.

మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే దానికి చెక్ పెట్టేయండి అంటున్నారు నిపుణులు.

సిగరెట్ లేదా పొగాకులో నికోటిన్ ఉంటుంది. టీలో కెఫిన్ ఉంటుంది.

ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. గుండె సమస్యలు పెరుగుతాయి.

బీపీ, యాంగ్జైటీ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి బీపీ ఉన్నవారు ఈ కాంబినేషన్ ట్రై చేయకూడదు.

టీ, హెర్బల్ టీ వల్ల కలిగే ప్రయోజనాలను స్మోకింగ్ దూరం చేస్తుందట.

టీలోని యాంటీఆక్సిడెంట్లను శరీరం అబ్జార్వ్ చేసుకోకుండా నికోటిన్ దూరం చేస్తుంది.

నికోటిన్, కెఫిన్ కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు పెంచుతాయి.

టీ తాగితే మీరు ప్రశాంతంగా ఉంటారనిపిస్తే.. మీరు స్మోకింగ్ మానేయడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.