రాత్రుళ్లు చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే పడుకునేప్పుడు ఫోన్ ఉపయోగించడం.

ఇలా నిద్రమానుకొని ఫోన్ ఉపయోగిస్తే శరీరానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా?

మొబైల్ స్క్రీన్​ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర దూరమవుతుంది.

కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కళ్లు వీక్​గా మారి పొడిబారిపోయి చికాకును కలిగిస్తాయి.

స్క్రీన్ లైట్​ వల్ల తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ కూడా ఎక్కువగా ట్రిగర్ అవుతుంది.

సిర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. నిద్ర నాణ్యత తగ్గి స్లీపింగ్ సమస్యలు పెరుగుతాయి.

రాత్రుళ్లు నిద్ర తగ్గడం వల్ల ఉదయం చేసే పనులపై ఫోకస్ చేయలేరు. పైగా లేజీగా తయారవుతారు.

పడుకొనే ముందు స్క్రీన్​కి వీలైనంత దూరంగా ఉండండి. మొబైల్​ కూడా అందుబాటులో కాకుండా దూరంగా ఉండేలా చూసుకోండి.

తప్పని పరిస్థితుల్లో మొబైల్ ఉపయోగించాల్సి వస్తే లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్, యాప్స్ ఉపయోగించవచ్చు.

స్క్రీన్ లైట్​ని డిమ్ చేసుకోండి. ఇది కంటిపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చేస్తుంది.