ఆలివ్ ఆయిల్‌ని ఆరోగ్య ప్రయోజనాల కోసం వంటలకు ఉపయోగిస్తారు. అయితే దీనిని సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. వృద్ధాప్య ఛాయలను దూరం చేయడంలో ఆలివ్ ఆయిల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడిన గాయాలను తగ్గించడంలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా చేసి మృదువుగా ఉండేలా చేస్తుంది. అందుకే దీనిని సౌందర్య రక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)