ఆవనూనెతో జుట్టుకి, స్కిన్‌కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? స్వచ్ఛమైన ఆవనూనెతో జుట్టుకి, స్కిన్‌కి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వృద్ధాప్య ఛాయలను దూరం చేసి.. ముడతలను ఇది తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలలో కూడా మంచి ఫలితం ఉంటుందని అధ్యయనం కూడా తేల్చింది. దీనిలో మోనోశ్చరాయిడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె సమస్యలు తగ్గిస్తాయి. బీపీ, బ్లెడ్ షుగర్ వంటి సమస్యలు కంట్రోల్ చేస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ఆర్థ్రరైటిస్, బ్రోంకైటిస్ సమ్యలు కూడా ఇది రిలీఫ్‌ని ఇస్తుంది. దీనిలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, ఈ, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా.. ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. వినియోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. (Images Source : Envato)