నలభైల్లోకి వచ్చిన పురుషుల్లో చాలా మంది ఉద్యోగ, కుటుంబ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉంటారు.

కానీ ఇది ఆరోగ్యం మీద కూడా దృష్టి నిలపాల్సిన సమయం.

తీసుకుంటున్న ఆహారం సమతులంగా ఉండేట్టు జాగ్రత్త పడాలి. పండ్లు, కూరగాయలు, గింజలు తప్పక ఉండాలా చూసుకోవాలి.

కండర పుష్టిని పెంచే వ్యాయామాలు తప్పక చెయ్యాలి. కండరాలు బలంగా ఉంటేనే ఎముకల ఆరోగ్యానికి, జీవక్రియలకు మంచిది.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి కొనసాగకుండా చూసుకోవాలి. ఒత్తిడి ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తుంది.

నిద్రను అశ్రద్ధ చెయ్యవద్దు. రోజుకు ఏడు గంటలు నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి.



శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.



తరచుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి టెస్టులు చేయించుకోవాలి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.