వెల్లుల్లితో పచ్చడి చేసుకోవచ్చు తెలుసా? ఊరగాయ రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

భారతదేశంలో ఊరగాయ కేవలం ఆహారం రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిది.

అందుకే వెల్లుల్లిని చాలా మంది ఇష్టంగా తింటారు.

దీనిలో భాగంగా వెల్లుల్లి ఊరగాయను కూడా చేసుకుని ఆస్వాదించవచ్చు.

వెల్లుల్లి రెబ్బలను బాగా వలిచి శుభ్రం చేయండి. తేమ అలాగే ఉండటానికి.. 2-3 గంటలు ఒక వస్త్రంపై ఉంచండి.

సోంపు, జీరా, పెద్ద యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలను తక్కువ మంట మీద వేయించండి.

అదే కడాయిలో ఆవాల నూనె వేసి వేడి చేయండి. తరువాత పెద్ద పాత్రలో వెల్లుల్లి రెబ్బలు ఉంచండి.

మసాలా, నూనెను పైన వేయండి. అలాగే ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొద్దిగా స్వీట్ వెనిగర్ వేయండి.

ఇప్పుడు వెల్లుల్లి ఊరగాయను ఒక జాడీలో వేసి 2-3 రోజులపాటు ఎండలో ఉంచండి.

అలా మసాలా వెల్లుల్లికి వెళ్తుంది. దీనివల్ల రుచి కూడా బాగా రెట్టింపు అవుతుంది.